పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె. మురళీమోహన్ ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు

2074చూసినవారు
29/6/26న చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లె గ్రామంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె. మురళీమోహన్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో కలిసి వ్యవసాయ పనులను ప్రారంభించిన ఆయన, ఖరీఫ్ సీజన్‌లో శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్