పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. సోమవారం పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం, చిగరపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన 35 గృహాలకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలను ఆయన అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.