పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ శనివారం పూతలపట్టు నియోజకవర్గంలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించే మామిడి పండ్లకు సరైన ధర చెల్లించాలని, టోకెన్ల జారీ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఆదేశించారు. మామిడి రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు.