పూతలపట్టు మండలం, తిరుపతి-చిత్తూరు హైవే ఆకనంబట్టు వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. తిరుపతి వైపు నుంచి ఆర్వీఎస్ నగర్ కు వెళ్తున్న సమయంలో టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదని, మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉందని సమాచారం. ఈ ఘటనతో హైవేపై కొద్దిసేపు వాహనాల రద్దీ ఏర్పడింది.