పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో జులై 3న సంకటహర చతుర్థి వ్రతాన్ని నాలుగు బ్యాచ్లలో నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిశోర్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంపతులకు టికెట్ ధర రూ. 500గా నిర్ణయించామని, భక్తులు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలని కోరారు.