చిత్తూరు, పూతలపట్టులోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, సభ్యుల బృందం మంగళవారం దర్శించుకుంది. రాష్ట్రంలో వివక్షతలేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని, అందరికీ న్యాయం జరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో అందరూ సమానమే అనే భావన బలపడాలని ఆకాంక్షించారు.