చిత్తూరు కొబ్బరి తోట బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

2309చూసినవారు
చిత్తూరు కొబ్బరి తోట బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు నగరంలోని కట్టమంచి ప్రాంతంలో కొబ్బరి తోటలోని బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి కొబ్బరి తోటలోకి వెళ్లినప్పుడు కాపలా కుక్కలు తరుమడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్