పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

850చూసినవారు
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల మెప్పు పొందిన సీఎం చంద్రబాబుపై పరుషమైన పదజాలంతో మాట్లాడటం సమంజసం కాదని, దీనిపై రాష్ట్ర ప్రజలందరూ అంబటికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్