పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం

3026చూసినవారు
పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్