పుంగనూరు: జనసేనలోకి 500 మంది చేరిక

555చూసినవారు
పుంగనూరు: జనసేనలోకి 500 మంది చేరిక
పుంగనూరు మండల పరిధిలోని బండపల్లి, నేక్కుంది తదితర గ్రామాలలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి దాదాపు 500 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, చిన్న రాయల్, పగడాల రమణ, శంకర్ రెడ్డి, వెంకట రెడ్డి, పాములహరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్