పుంగనూరు: పోలియో చుక్కలు వేసిన అడిషనల్ ఎస్పీ

2011చూసినవారు
పుంగనూరు: పోలియో చుక్కలు వేసిన అడిషనల్ ఎస్పీ
పుంగనూరు మండలం, మల్లుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. మిగిలిన ప్రదేశాలలో నాయకులు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు రెండు చుక్కల పోలియో మందును వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్