అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ చైర్మన్‌గా రహమత్ అలీ ఖాన్, కార్యదర్శిగా బుడ్డన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్, జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రెజరర్‌గా శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రసాద్‌బాబు, భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు పూలమాలలతో సన్మానించారు.