పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పెద్దిరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకుల నుండి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.