మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు మండలంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.