పుంగనూరు: కోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు

957చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో గురువారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కోడిపందెం ఆడుతున్న 13మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ఆరు కోళ్లు, రూ. 25వేల నగదు, 11 వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.  .

సంబంధిత పోస్ట్