పుంగనూరు: సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు

1540చూసినవారు
పుంగనూరు: సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాలపై ప్రసరించాయి. ఈ అరుదైన సంఘటనను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుబ్రహ్మణ్య, సూర్యాష్టకాలను పఠించారు.

సంబంధిత పోస్ట్