బీచ్ లో ముగ్గురు చిన్నారులు గల్లంతు

5చూసినవారు
బీచ్ లో ముగ్గురు చిన్నారులు గల్లంతు
నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చిన చిత్తూరు జిల్లా సోమాల మండలం కందుకూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులు సరదాగా తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు బీచ్‌కు వెళ్లగా విషాదం చోటుచేసుకుంది. బీచ్‌లో సముద్ర స్నానానికి వచ్చి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో బాలుడు మహమ్మద్ సుఫియాన్ మృతి చెందగా, ఒక బాలికను రక్షించారు. మరో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో బీచ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన బాలిక క్షేమంగా ఒడ్డుకు చేరాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.