
రేణిగుంటలో ఉచిత కంటి వైద్య శిబిరానికి అద్భుత స్పందన
రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్, తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యాధికారులు రోగులకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయగా, నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని క్లబ్ అధ్యక్షుడు జూలియన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రాజేంద్ర, కోటేశ్వరరావు, గంగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.






























