జాతీయ రహదారిపై ఓ కారు బోల్తా

139చూసినవారు
జాతీయ రహదారిపై ఓ కారు బోల్తా
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి సమీపంలో రేణిగుంట- నాయుడుపేట జాతీయ రహదారిపై ఒక కారు బోల్తా పడింది. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నెల్లూరు నుంచి తిరుపతికి కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.