రేణిగుంటలో ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు

8చూసినవారు
రేణిగుంటలో ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు
తిరుపతిలోని రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం ఆత్మీయ వీడ్కోలు సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, పరస్పరం పూలగుచ్ఛాలు, జ్ఞాపికలతో సత్కరించుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సంక్షేమానికి చేసిన కృషిని, తమ అనుభవాలను సభ్యులు ప్రసంగాల ద్వారా నెమరువేసుకున్నారు.

సంబంధిత పోస్ట్