ఏర్పేడు మండలం కందాడు గ్రామంలో మంగళవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శనపగుంట ఎస్టీ కాలనీకి చెందిన జి. రవితేజ (9) అనే బాలుడు చెరువులో జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నాలుగో తరగతి చదువుతున్న రవితేజ ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. స్థానికులు అతన్ని బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితం నాగలాపురంలో బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మరవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది.