శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం వికృతమాల గ్రామం సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంగళవారం కలుషిత ఆహారం తిని కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. క్యాంటీన్లో భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో బాధపడటంతో అప్రమత్తమైన యాజమాన్యం వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించింది. ప్రస్తుతం కార్మికులందరూ క్షేమంగానే ఉన్నారని, ఎటువంటి ప్రమాదం లేదని యాజమాన్యం తెలిపింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.