శ్రీకాళహస్తిలో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్

761చూసినవారు
శ్రీకాళహస్తిలో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్
శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి అదృశ్యమైనట్లు సీఐ నాగార్జున్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25న కళాశాలకు వెళ్లి మధ్యాహ్నం బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాకపోవడంతో, తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తల్లి సునీత టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్