చికిత్స పొందుతూ ఒకరు మృతి

7చూసినవారు
చికిత్స పొందుతూ ఒకరు మృతి
రేణిగుంటలో కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన టి. మణి @ సుబ్రహ్మణ్యం (36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూన్ 28న తన సహజీవన భాగస్వామి లలితతో పిల్లల విషయమై గొడవపడి పురుగుల మందు తాగాడు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పిల్లలు దూరంగా ఉన్నారనే బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you