విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం

2061చూసినవారు
విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం
రేణిగుంట మండలం, ఎల్లమండ్యం పంచాయతీ పరిధిలోని పిల్లపళ్ళెం హరిజనవాడలో మంగళవారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి మంచికాయలు రేణుకార్జున(47) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద పంచాయతీ మోటార్‌ను ఆఫ్ చేసేందుకు వెళ్లిన సమయంలో, స్టార్టర్ ఐరన్ బాక్స్‌కు విద్యుత్ ప్రసారం కావడంతో అతడు తీవ్ర షాక్‌కు గురై కిందపడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని స్థానిక సన్‌రైజ్ ఆసుపత్రికి, ఆపై తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని భార్య తెలపగా, గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్