ఏర్పేడు మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోబాక పంచాయతీ కుప్పయ్య కండ్రిగకు చెందిన వెంకటరమణ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అతడిని వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.