పల్లంపేట: హైవేపై గుంతతో అవస్థలు

1225చూసినవారు
పల్లంపేట: హైవేపై గుంతతో అవస్థలు
శ్రీకాళహస్తి ఏర్పేడు-వెంకటగిరి హైవేపై పల్లంపేట కొత్త ఇల్లు వద్ద వాటర్ పైప్ లీకేజీతో ఏర్పడిన గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నీళ్ల కారణంగా గుంత కనిపించక బైకర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఇలాగే గుంత ఏర్పడినా అధికారులు పట్టించుకోలేదని, స్థానిక యువకులు తాత్కాలికంగా పూడ్చారని, ఇప్పుడు మళ్లీ అదే చోట గుంత ఏర్పడిందని స్థానికులు తెలిపారు. హైవే సిబ్బంది తారు వేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్