అన్నస్వామిపల్లిలో పీఎం పోషణ్’ అవగాహన సదస్సు

1698చూసినవారు
అన్నస్వామిపల్లిలో పీఎం పోషణ్’ అవగాహన సదస్సు
తిరుపతిలోని రేణిగుంట మండలం అన్నస్వామిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో 'పీఎం పోషణ్ - అంగన్‌వాడీ ఉత్సవ్' కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఐసీడీఎస్ సీడీపీఓ కే. కృష్ణవేణి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సమతుల ఆహారం, మొదటి 1000 రోజుల ప్రాధాన్యత, పరిశుభ్రతపై అధికారులు అవగాహన కల్పించారు. ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమవతి, డాక్టర్ ఉదయశ్రీ, ఎంపీహెచ్‌ఈవో నాగరాజు, రాస్ కోఆర్డినేటర్ భారతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్