శ్రీకాళహస్తి రేణిగుంట గ్రామపంచాయతీ పరిధిలో 2026-27 సంవత్సరానికి నిర్వహించాల్సిన వేలం ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన ఈ వేలం పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల నిలిపివేసినట్లు తెలిపారు. బిడ్డింగ్, ఓపెనింగ్, అప్రూవల్ ప్రక్రియలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.