తొట్టంబేడు మండలం ఎగువసాంబయ్యపాలెంకు చెందిన మంజుల తన కుమార్తెను పాఠశాలలో వదిలేందుకు వెళ్తుండగా, పుత్తేరి గ్రామానికి చెందిన చందు, చరణ్, జగదీశ్ పల్సర్ బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మంజుల కాలుకు, ఆమె కుమారుడు శ్రీనివాస్ తలకు గాయాలయ్యాయి. వారిని మొదట శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.