శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి వైపు వెళ్తున్న బైకును ఒక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.