ఏర్పేడు మండలంలో మంగళవారం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కాలువలు, చెరువులు, వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మోదుగులపాలెం వద్ద సువర్ణముఖి నది పొంగి పొర్లుతూ రహదారిపైకి నీరు చేరడంతో, అధికారులు ముళ్ల కంచె ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. నది దాటేందుకు ప్రయత్నించవద్దని స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నీటి మట్టం తగ్గే వరకు ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.