ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ల మధ్య యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతినడంతో శ్రీకాళహస్తిలో టీ దుకాణాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా చిన్న టీ దుకాణాలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. స్థానిక మార్కెట్లో సరఫరా సమయానికి అందక దుకాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రూ. 10 ఉన్న టీ ధర రూ. 12 నుంచి రూ. 15 వరకు పెంచి అమ్ముతున్నారు.