ఆటో ప్రయాణికుడిపై దాడి, దోపిడీ.. ముగ్గురు అరెస్ట్

0చూసినవారు
ఆటో ప్రయాణికుడిపై దాడి, దోపిడీ.. ముగ్గురు అరెస్ట్
తిరుపతిలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని బెదిరించి, దాడి చేసి నగదు, ఫోన్ దోపిడీ చేసిన కేసులో ముగ్గురు పాత నేరస్థులను గాజులమండ్యం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 24న రాత్రి తూకివాకం చెరువు సమీపంలో జరిగిన ఈ ఘటనపై దామినేడు క్రాస్ వద్ద రేణిగుంట రూరల్ మంజునాథ రెడ్డి, హరీష్ సిబ్బందితో కలసి నిందితులు ఎస్. జయకుమార్, జరుపాల్ హన్మంతు, సుంకర మోహిత్ సాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నేరానికి వాడిన రెండు ఆటోలు, స్వాధీనం చేసుకున్న VIVO ఫోన్‌తో పాటు BNS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్