మామండూరు వద్ద రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి

165చూసినవారు
మామండూరు వద్ద రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి
రేణిగుంట (మండలం) మామండూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మాధవన్ అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై నుంచి వస్తున్న లారీని కడప నుంచి వస్తున్న సిమెంట్ కాంక్రీట్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన మరో డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సిమెంట్ లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్