రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

4936చూసినవారు
రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రేణిగుంట రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌లోని పురుషుల జనరల్ వెయిటింగ్ హాల్‌లో సుమారు 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి, చేతికి బంగారు రంగు 'సోనాటా' వాచ్ పెట్టుకుని ఉన్నాడు. ఈ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించలేదని, ఆచూకీ తెలిసిన వారు వెంటనే రేణిగుంట జీఆర్‌పీ అధికారులను సంప్రదించాలని జీఆర్‌పీ ఎస్ఐ బి. మధుసూదనరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్