
పెళ్లకూరు: అన్నపై తమ్ముడి దాడి
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాలచ్చూరులో మద్యం సేవించి గొడవ చేస్తున్న తమ్ముడు వినోద్‌ను అన్న సుధీర్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, ఆగ్రహించిన వినోద్ అన్నపై దాడి చేశాడు. ఈ ఘటనపై అన్న సుధీర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




































