సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్‌కు కళ్లు తిరగడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం తీవ్రమైంది. ఈ ఘటనలో గుమ్మడిపూడి మండలం నాయుడు కుప్పానికి చెందిన పోలయ్య (23) గాయపడినట్లు సమాచారం.