తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేటకు కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతన్ని బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. గాయపడిన వెంకటేశ్‌ను వెంటనే ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.