కాలేజీ బస్సుకు ప్రమాదం

1500చూసినవారు
కాలేజీ బస్సుకు ప్రమాదం
సోమవారం ఉదయం 8:30 గంటలకు సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీకాళహస్తి నుంచి విద్యానగర్‌లోని NBKR కాలేజీకి వెళ్తున్న ఈ బస్సు మార్గమధ్యంలో అదుపుతప్పి హైవే సర్వీస్ రోడ్డును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విద్యార్థులందరినీ మరో బస్సులో కాలేజీకి తరలించారు.

సంబంధిత పోస్ట్