రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని పెళ్లకూరు జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.