ప్రముఖ వైద్యుడు డాక్టర్ మునిస్వామి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

1169చూసినవారు
ప్రముఖ వైద్యుడు డాక్టర్ మునిస్వామి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
తడ మండలం మాంబట్టు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మునిస్వామి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్వగ్రామంలో జరుగుతున్న దేవాలయ పూజలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పేలడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో సేవలందించిన ఆయన మరణం వైద్య వర్గాలను కలచివేసింది. తడ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్