తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని హోలీ క్రాస్ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీ సిటీలో పనిచేస్తున్న రాజశేఖర్, శ్రావణి అనే ఇద్దరు యువతీయువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సూళ్లూరుపేటకు బైక్‌పై వెళ్తుండగా, చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్న కంటైనర్ లారీ వీరి బైక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు ధర్మారం గ్రామం, తిరవలూరు జిల్లాకు చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.