అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

283చూసినవారు
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
పెళ్లకూరు మండలం దొడ్లవారిమెట్ట గ్రామానికి చెందిన భువన (25) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా ఉండగా ఆరోగ్య సమస్యల కారణంగా అబార్షన్ చేయించుకోవాలని భావించారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్త సమాచారం ఇచ్చిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు నెలలుగా దాంపత్య కలహాలు, అక్రమ సంబంధాలపై మనస్పర్థలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.