సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఈ వేడుకలను ప్రారంభించి, స్టాళ్లను పరిశీలించారు. అతిపెద్ద ఫ్లెమింగో బొమ్మ, ఫ్లెమింగో ఫెస్టివల్ బెలూన్, వివిధ రకాల బాతులు, ఎద్దులు, గిర్ జాతి ఆవులు, ఒంగోలు జాతి ఎద్దులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం, అతిపెద్ద ఫ్లెమింగోతో తిరుపతి కలెక్టర్, ఎమ్మెల్యే ఫోటో దిగారు.