
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్
శనివారం తెల్లవారుజామున ఏర్పేడు (M) మేర్లపాక హరిజనవాడ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. బలమైన గాయాల కారణంగా అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






































