తిరుమలలోని అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. 2765వ మెట్టు సమీపంలో ఓ చెట్టుపై చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా, భద్రతా సిబ్బంది వారిని గుంపులు గుంపులుగా పంపుతున్నారు. ఈ సంఘటనతో నడకమార్గంలో ప్రయాణించే భక్తుల్లో ఆందోళన నెలకొంది.