తిరుపతిలో ఏసీబీ దాడులు

1627చూసినవారు
తిరుపతిలో ఏసీబీ దాడులు
తిరుపతి జిల్లాలో గురువారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో సస్పెండ్ అయిన రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అటెండెంట్ తిరుమలేష్ ఇంట్లో ఈ దాడులు జరుగుతున్నాయి. తిరుమలేష్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో.. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలో శివ జ్యోతి నగర్, నెల్లూరులో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్