తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారి మల్లికార్జున నేతృత్వంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. క్రయ విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో కొనుగోలుదారులను కూడా అధికారులు విచారిస్తున్నారు.