తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో బుధవారం ఉదయం ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలోని ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తిరుమలలోని B-టైప్ క్వార్టర్స్ వద్ద కూడా ACB అధికారులు వేచి ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.